భారత్ లోని వివిధ బ్యాంకులు కొత్తగా ఉద్యోగుల నియామకాలు చేపట్టక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వచ్చే రెండేళ్లలో సుమారు 80 వేల మంది పదవీ విరమణ చేయనుండటంతో కొత్తగా ఉద్యోగాల భర్తీకి బ్యాంకులు సమాయత్తం అవుతున్నాయి. ఈ సంవత్సరం 29,756 మంది రిటైర్ అవుతారని బ్యాంకు వర్గాల అధికారిక అంచనా. ఇందులో 19,065 మంది ఆఫీసర్లు, 14,669 మంది క్లర్కులతో పాటు 6,022 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ఇక వచ్చే సంవత్సరం 39 వేల మంది పదవీ విరమణ చేయనుండగా, ఇందులో 18,506 మంది ఆఫీసర్లు, 14,458 మంది క్లర్కులున్నారు.
ఎస్బీఐలో మార్చి 2016లోపు 8,674 మంది రిటైర్ కానున్నారని బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. అందరినీ కాకపోయినా, మార్చిలోగా 2 వేల మందిని విధుల్లోకి నియమించుకుంటామని ఆమె వివరించారు. కాగా, మధ్యస్థాయి ఉద్యోగ నియామకాల్లో బ్యాంకులకు కొంత స్వేచ్ఛను ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. బ్యాంకులు తమ విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండా కొందరిని విధుల్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో 22 ప్రభుత్వ రంగ బ్యాంకులుండగా, ఎస్బీఐకి మరో 5 అనుబంధ బ్యాంకులున్నాయి. మరోవైపు క్యాంపస్ నియామకాలు చేపట్టాలని కూడా బ్యాంకులు భావిస్తుండగా, ఇందుకు న్యాయపరమైన చిక్కులు రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి