హైదరాబాదు నగరంలో ప్రైవేట్ వైద్య రంగంలో మెరుగైన సేవలందిస్తున్న ‘యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్’ యాజమాన్యం దాతృత్వంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రాంపూర్ కు చెందిన గొరుకంటి యశోద, రాంచందర్ రావు (పేష్కారి) దంపతుల నలుగురు కొడుకులు రవీందర్ రావు, సురేందర్ రావు, నరేందర్ రావు, దేవేందర్ రావులు ఉన్నత చదువులు చదివి ఉమ్మడిగానే తల్లి పేరిట ‘యశోద’ ఆసుపత్రిని నెలకొల్పారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనూ ఓ ప్రముఖ ఆసుపత్రిగా ఎదిగింది.
అసలు విషయానికొస్తే... గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ‘గ్రామజ్యోతి’ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతోంది. కార్పొరేట్లు, వాణిజ్య సంస్థలు ఈ పథకంలో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన ‘యశోద’ సోదరులు తమ సొంతూరు అభివృద్ధికి ఏకంగా రూ.60 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అంతేకాక గ్రామంలో ఇప్పటికీ తమకు ఉన్న 11 ఎకరాల 30 గుంటల సాగు భూమి, 30 గుంటల స్థలంలో ఉన్న పెంకుటిల్లును కూడా ప్రభుత్వానికి అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నేడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్న సీఎం కేసీఆర్ కు భూమి పత్రాలతో పాటు విరాళం చెక్కును ‘యశోద’ సోదరులు అందించనున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి