స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్ భవన్ లో 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. ఈ విందు కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఇతర ముఖ్య నేతలను ఆహ్వానించారు. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. గవర్నర్ కార్యక్రమంలో ముఖ్యులిద్దరూ కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. కాగా, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, టీడీపీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన నేతలను గవర్నర్ నరసింహన్ పేరుపేరునా పలకరించి, ఉత్సాహం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎట్ హోం కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు రాలేదన్నది వాస్తవమని అన్నారు. ఇద్దరు సీఎంల గైర్హాజరీ వెనుక ప్రత్యేక కారణాలు వెతకవద్దని సూచించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తాను ఆమోదయోగ్యమైన గవర్నర్ నని చెప్పుకొచ్చారు. హైదరాబాదులో తన చివరి రోజు వరకు ఆమోదయోగ్యంగానే ఉంటానని ఉద్ఘాటించారు. తాను ఆశావాదినని... పరిస్థితులన్నీ చక్కబడతాయని పేర్కొన్నారు. చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు కార్యక్రమంలో ఉన్నారని, కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టుల సమీక్షలో ఉన్నారని, అందుకే రాలేకపోయారని వివరణ ఇచ్చారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి