: గొప్ప గౌరవం...‘ఖేల్ రత్న’పై సానియా స్పందన
రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం మరిన్ని విజయాలు సాధించేందుకు తనలో స్ఫూర్తినిస్తుందని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేర్కొంది. భారత ప్రభుత్వం తనకు ప్రకటించిన ఖేల్ రత్న పురస్కారంపై ఆమె స్పందించింది. ‘‘ఖేల్ రత్న దక్కడం గొప్ప గౌరవం. నా దేశం నా మీద ఇంత ప్రేమ, గౌరవం చూపినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా టోర్నీలు ఆడటం నాకు గర్వకారణం. నా శ్రమకు గుర్తింపునివ్వడం ద్వారా భారత ప్రభుత్వం నేను దేశం కోసం మరిన్ని విజయాలు సాధించడానికి అవసరమైన స్ఫూర్తి నింపింది’’ అని సానియా పేర్కొంది.