ఇండియాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. శుక్రవారం నాడు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల ప్రకారం, పప్పుధాన్యాల ధరలు గణనీయంగా పెరుగుతుంటే, మిగతా ఉత్పత్తుల టోకు ధరలు మాత్రం పడిపోతున్నాయి. హోల్ సేల్ ధరల విభాగంలో వరుసగా తొమ్మిదో నెలలోనూ ప్రతి ద్రవ్యోల్బణం నమోదైంది. గడచిన జూన్ లో 2.4 శాతం వరకూ తగ్గిన ధరలు జూలైలో 4.05 శాతం మేరకు పడిపోయాయి. చాలా నెలల తరువాత ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గినట్టు గణాంకాలు వెల్లడించాయి. మొత్తం మీద జూలై ద్రవ్యోల్బణం 5.41 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో చిల్లర ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయిలో 3.78 శాతానికి చేరింది.
ఈ నెలలో ద్రవ్యోల్బణానికి 'విలన్'గా నిలిచింది పప్పుధాన్యాలు మాత్రమే. గత సంవత్సరంతో పోలిస్తే, జూన్ లో 33.67 శాతం పెరిగిన పప్పుధాన్యాల ధరలు, జూలైలో 35.75 శాతానికి చేరి సామాన్యుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నెలలో పాల ధర 5.18 శాతం నుంచి 5.30 శాతానికి పెరగగా, గుడ్లు, మాంసం, చేపలు తదితరాల ధరలు 2.25 శాతం తగ్గాయి. పంచదార ధర ఏకంగా 17.48 శాతం తగ్గింది. రైతులకు చెల్లింపులు జరిపేందుకు మిల్లర్లకు సులభ రుణాలిచ్చేందుకు కేంద్రం అంగీకరించడం, పెట్రోల్ లో ఇథనాల్ ను మరింత ఎక్కువగా వాడేందుకు తీసుకున్న నిర్ణయాలు పంచదార ధర తగ్గడానికి దోహదపడ్డాయి. నిత్యావసర వస్తువుల్లో ఉల్లిపాయల ధర 0.49 శాతం తగ్గింది. ఉల్లి ద్రవ్యోల్బణం జూన్ లో 18.54 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం గణాంకాలు తదుపరి పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించేందుకు సహకరిస్తాయని నిపుణులు వ్యాఖ్యానించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి