దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారత ప్రధాని జెండా ఎగురవేయడమన్నది సంప్రదాయంగా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, దేశానికి ప్రధానులుగా పనిచేసిన ఇద్దరికి ఆ అవకాశం దక్కలేదు. వారే గుల్జారీలాల్ నందా, చంద్రశేఖర్. 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత ప్రధాని బాధ్యతలు చేపట్టిన నందా, అదే సంవత్సరం జూన్ 9న రాజీనామా చేశారు. ఆపై మరోసారి 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మృతి తరువాత ప్రధానిగా మళ్లీ సేవలందించినా, కొద్ది రోజులకే ఇందిరా గాంధీకి బాధ్యతలు అప్పగించాల్సి రావడంతో ఆయన ఎర్రకోట ఎక్కలేపోయారు.
ఇక 1990 నవంబర్ 10న దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రశేఖర్ 1991 జూన్ 21న పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో ఆయన కూడా ఎర్రకోటపై పతాకావిష్కరణ చేయలేకపోయారు. కాగా, జవహర్ లాల్ నెహ్రూ 17 సార్లు, ఇందిరా గాంధీ 16 సార్లు, మన్మోహన్ సింగ్ 10 సార్లు, వాజ్ పేయి 6 సార్లు, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ లు రెండు సార్ల చొప్పున ఎర్రకోటపై ప్రధాని హోదాలో జెండా ఎగురవేశారు.
More Telugu News
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్