ఏపీలో ఆగస్టు 15 వేడుకలు ఈసారి విశాఖపట్నంలో నిర్వహించనుండటంతో సాగర తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రజలంతా వేడుకలు చూసేందుకు బీచ్ లో ప్రత్యేకంగా ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామని నగర కమిషనర్ అమిత్ గార్గ్ తెలిపారు. ఇక నగరమంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వేడుకలకు వచ్చేవారు రేపు ఉదయం 8 గంటలలోపు బీచ్ రోడ్డుకు చేరుకోవాలని సీపీ సూచించారు. మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రులు, కొంతమంది అధికారులు ఈ సాయంత్రం విశాఖ చేరుకుంటారు.