కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన ప్రముఖ నాస్తికవాది, ప్రఖ్యాత వైద్యుడు సమరం సోదరుడు గోపరాజు లవణం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా) రెండో కుమారుడే ఈ లవణం. ఉప్పు సత్యాగ్రహం సమయంలో పుట్టినందున తల్లిదండ్రులు ఆయనకు లవణం పేరు పెట్టారు. 1973లో విజయవాడలో హేతువాద సంఘం అధ్యక్షుడిగా లవణం బాధ్యతలు నిర్వహించారు. ప్రముఖ కవి గుర్రం జాషువా కుమార్తె హేమలత లవణం సతీమణి.