తెలుగు రాష్ట్రాల మధ్య వేడి రాజేసిన ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వివాదాలు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల గన్ మెన్లు, కారు డ్రైవర్ల పాలిట శాపంలా మారాయి. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వేం నరేందర్ రెడ్డి కారు డ్రైవర్లతో పాటు గన్ మెన్లను కూడా తెలంగాణ ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కొందరికి నోటీసులిచ్చి విచారించగా, మరికొందరిని కేవలం ఫోన్ కాల్ తో తమ కార్యాలయానికి రప్పించుకున్నారు. తాజాగా టీడీపీ యువనేత నారా లోకేశ్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డికి కూడా మొన్న నోటీసులు జారీ చేశారు. అయితే నిన్న విచారణకు రావాల్సిన కొండల్ రెడ్డి ఏసీబీ నోటీసులకు స్పందించలేదు. దీంతో అతడికి మరోమారు నోటీసులు జారీ చేయాలని ఏసీబీ భావిస్తోంది.
టీ ఏసీబీ నోటీసులకు ప్రతిగా ఏపీ పోలీసులు కాస్త గట్టిగానే ప్రతిస్పందిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారు తెలంగాణ మంత్రి కేటీఆర్ గన్ మెన్లకు నోటీసులు జారీ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రముఖుల గన్ మెన్లు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నామో, వారి సూచనల మేరకే వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్న గన్ మెన్లు, డ్రైవర్లు తామేదో తప్పు చేననట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమ పరిస్థితి ముందు నొయ్య, వెనుక గొయ్య మాదిరి తయారైందని వారు వాపోతున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి