గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనకు సంబంధించి మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సీనియర్ల వేధింపులపై రిషితేశ్వరి రాసుకున్న ఓ డైరీని గతంలో పోలీసులు ఆమె హాస్టల్ గది నుంచే స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వరంగల్ లోని ఆమె ఇంటిలో మరో డైరీ లభ్యమైంది. దీనిని ఆమె తల్లిదండ్రులు నిన్న పోలీసులకు అప్పగించారు. ఈ డైరీలో రిషితేశ్వరి 12 పేజీలు రాసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారకులుగా భావిస్తూ సీనియర్లు శ్రీనివాస్, జయచరణ్, అనీషాలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా రెండో డైరీలోనూ వీరి వేధింపులపై రిషితేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
తాను సోదరుడిలా భావించే జితేంద్రతో తనకు సంబంధం ఉందని శ్రీనివాస్, జయచరణ్ లు తప్పుడు ప్రచారం చేశారని అందులో రిషితేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాక తనను లైంగికంగా వేధించి వెంటపడ్డారని తెలిపింది. శ్రీనివాస్ చెప్పినట్లు వినాలని అనీషా తనను బెదిరించిందని కూడా ఆమె పేర్కొంది. ఇక తమ చేతికి అందిన రెండో డైరీని హాస్టల్ గదిలో లభించిన డైరీ, సూసైడ్ నోట్ తో పోలీసులు సరిపోల్చారు. రెండో డైరీని కూడా రిషితేశ్వరే రాసిందని కూడా వారు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఫ్రెషర్స్ డే ముగిసిన తర్వాత ఇంటికెళ్లిన సందర్భంగా రిషితేశ్వరి రెండో డైరీని రాసుకుందని పోలీసులు భావిస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి