సోషల్ మీడియాలో చిన్న 'శ్రీమంతుడు' హల్ చల్ చేస్తున్నాడు. శ్రీమంతుడు సినిమా వచ్చిన తరువాత మహేష్ బాబు అభిమానులు సైకిళ్లకు బూజు దులుపుతున్నారు. పెద్దలైతే చిన్నప్పుడు సైకిళ్లను అద్దెకు తీసుకుని తొక్కిన రోజులను గుర్తు చేసుకుంటున్నారు. విలువలు కలిగిన కమర్షియల్ సినిమా శ్రీమంతుడు ద్వారా సైకిళ్లకు డిమాండ్ పెంచిన మహేష్ బాబు కుమారుడు సైకిల్ పై సవారీ చేశాడు. కుటుంబంలోని ఇతర చిన్నపిల్లలతో కలిసి మహేష్ బాబు కుమారుడు గౌతమ్ సైకిల్ పై షికారు చేశాడు. పిల్లలందరితో సైకిల్ తొక్కుతున్న గౌతమ్ ఫోటోను మహేష్ బాబు బావ సుధీర్ బాబు సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ ఫోటోకు మహేష్ అభిమానుల నుంచి ఆదరణ వెల్లువెత్తుతోంది. షేర్లు, లైకులతో గౌతమ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.