బహ్రెయిన్ లో భారతీయ దంపతులకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. వారి కుమార్తె జనవరిలో చనిపోతే ఆ పాపకు ట్యూషన్ ఫీజు చెల్లించాలంటూ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. దాంతో ఎలా స్పందించాలో అర్థంకాని స్థితిలో పడిపోయారు. వివరాల్లోకెళితే... కేరళకు చెందిన జోఫీ చెరియన్, షైనీ ఫిలిప్ దంపతులు బహ్రెయిన్ లో 27 ఏళ్లుగా ఉంటున్నారు. వారి ఎనిమిదేళ్ల కుమార్తె అబియా శ్రేయా జోఫీ జనవరిలో చికెన్ పాక్స్ కారణంగా మరణించింది. కుమార్తె మరణంతో తల్లి షైనీ తీవ్ర మనోవేదనకు లోనైంది. ఇంతలోనే ఫీజు కట్టాలంటూ స్కూల్ నుంచి ఫోన్ రావడం ఆ దంపతులకు ఆగ్రహం తెప్పించింది.
ఓ తల్లి మనోభావాలను పట్టించుకోకుండా స్కూల్ సిబ్బంది ఇలా ఫోన్ చేయడం దురదృష్టకరమని జోఫీ చెరియన్ మండిపడ్డారు. పది రోజుల క్రితం తన భార్యకు ఫోన్ చేసి ఫీజు విషయం చెప్పారని, అప్పుడు తమ కుమార్తె చనిపోయిన విషయం చెప్పి ఆమె పేరు తొలగించాలని కోరామని వివరించారు. అయితే, సోమవారం మళ్లీ తనకు ఫోన్ చేసి ఫీజు విషయం అడిగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్కూలు యాజమాన్యం క్షమాపణ కోరింది. పాలనా పరమైన తప్పిదం చోటుచేసుకుని ఉంటుందని పాఠశాల చైర్మన్ ప్రిన్స్ నటరాజన్ పేర్కొన్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి