సిరియాలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న 22 మంది క్రైస్తవ బందీలు విడుదలయ్యారు. గత ఫిబ్రవరి 23న వీరిని కిడ్నాప్ చేశారు. అయితే, ఉగ్రవాదుల చెరలో ఇంకా చిన్నారులు, మహిళలు సహా 187 మంది వరకు ఉన్నట్టు సమాచారం. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన వారు సిరియాకు ఉత్తరాన ఉన్న హసాఖా పట్టణానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి వీరంతా క్షేమంగానే ఉన్నారు. మరోవైపు సామాన్యులను కిడ్నాప్ చేస్తున్న ఐఎస్ఐఎస్ పై మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.