గాలేలో భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లంక ఇన్నింగ్స్ ను కౌశాల్ సిల్వ, కరుణరత్నేలు ప్రారంభించారు. ప్రస్తుతం శ్రీలంక 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. టీమిండియా తుది జట్టులో శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ, కోహ్లీ, రహానే, సాహా, అశ్విన్, హర్భజన్, అమిత్ మిశ్రా, ఆరోన్, ఇషాంత్ శర్మలు ఉన్నారు. శ్రీలంక జట్టులో కౌశాల్ సిల్వ, కరుణరత్నే, సంగక్కర, తిరిమన్నే, మాథ్యూస్, చండిమల్, ముబారక్, హెరాత్, దమ్మిక ప్రసాద్, నువాన్ ప్రదీప్, కౌశాల్ ఉన్నారు.