ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్ గ్రూపుకు చెందిన జిహాదీలు బ్రిటన్ లో దాడులకు సిద్ధంగా ఉన్నారన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. ఒక్కరే వెళ్లి లక్ష్యాలపై దాడులు చేసేందుకు అవసరమైన శిక్షణ పొందారని, వారి లక్ష్యం బ్రిటన్ లో రాణి, రాజ కుటుంబీకులు పాల్గొనే రెండో ప్రపంచయుద్ధ విజయాల తాలూకు సంస్మరణ సభలేనని బ్రిటీష్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న జిహాదీల్లో కొందరు సిరియాలో శిక్షణ పొందినవారని తెలుస్తోంది. ఈ వివరాలను ఐఎస్ నుంచి రాబట్టేందుకు స్కై న్యూస్ మీడియా సంస్థ ఓ ఎత్తుగడ వేసింది.
జిహాద్ కు నిబద్ధులైన వ్యక్తులు అంటూ రెండు కల్పిత పాత్రలతో ఐఎస్ ను ఆకర్షించింది. ఆ కల్పిత వ్యక్తులు ఓ పురుషుడు, ఓ మహిళ కాగా... వారు ట్విట్టర్లోనూ, ఇతర చాటింగ్ వేదికలపైనా చేసే సంభాషణలు ఐఎస్ ను నమ్మించే విధంగానే సాగాయి. దాంతో, వారు తమకు విధేయులని నమ్మిన ఐఎస్ సీనియర్లు మార్గదర్శక పుస్తకాలను పంపారు. నిధుల సేకరణ, ఆయుధాల తయారీకి సంబంధించిన సలహాలు ఆ పుస్తకాల్లో పొందుపరిచారు. ఈ క్రమంలోనే సదరు కల్పిత పాత్రలు బ్రిటన్ లో ఉన్న ఐఎస్ జిహాదీలతో చాట్ చేయగా, బ్రిటన్ రాణి పాల్గొనే కార్యక్రమాలపై దాడి వివరాలు కూడా తెలిశాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి