సంప్రదాయాలు, మతాలు మనిషి మనుగడకు ఉపయోగపడతాయని భావించిన పెద్దలు నియమ నిబంధనలు రూపొందించారు. అవే పరమావధిగా బ్రతికేస్తున్నారు కొందరు బుద్ధి జీవులు. తాజాగా మౌఢ్యంతో కన్నకూతురిని పొట్టనబెట్టుకున్నాడో తండ్రి. వివరాల్లోకి వెళ్తే... దుబాయ్ లో ఓ తండ్రి తన కుమార్తెను తీసుకుని ఓ సాయంకాలం సరదాగా సముద్ర తీరానికి వచ్చాడు. కాస్సేపయ్యాక కూతురు ముచ్చట పడుతుంటే ఇద్దరూ కలసి నీటిలోకి వెళ్లారు. అలలతాకిడికి ఇద్దరూ లోపలికి కొట్టుకుపోయారు. దీనిని గమనించిన బే గార్డ్స్ (రక్షక సిబ్బంది) పరుగున వచ్చి వారిని రక్షించబోయారు.
తమను రక్షించేందుకు వస్తున్న ఇద్దరూ పురుషులే అని గమనించిన తండ్రి వారికి చేయి అందించవద్దని, సముద్రంలో మునిగిపోవాలని సూచించాడు. దీంతో ఆ కుమార్తె తండ్రి మాటను పాటించి సముద్రంలో మునిగి మరణించింది. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకలా చేశావంటూ ప్రశ్నించగా, యవ్వనంలో ఉన్న తన కుమార్తెను పరపురుషుడు తాకితే ఆమె ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని, అంతకంటే చావు మేలు అని భావించి అలా చెప్పానని ఆమె తండ్రి సమాధానం చెప్పాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి