వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ సర్కారుపై ధ్వజమెత్తారు. రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద తొక్కిసలాట కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ప్రభుత్వం చెబుతున్న దానికంటే ఎక్కువే ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. చాలా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించలేదని, వాటిని అలాగే సంబంధీకులకు అప్పగించారని అన్నారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. బొత్స బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలో కుటుంబంతో కలిసి పుష్కరస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.