వివాహ బంధాన్ని అపహాస్యం చేశారని పేర్కొంటూ ఓ ప్రేమజంటను గ్రామస్థులు చిత్రహింసలకు గురిచేసిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. హోషంగాబాద్ జిల్లా, సింగోడా గ్రామానికి చెందిన అక్షయ్ మోహ్రా అనే యువకుడు, మైదఖేడా గ్రామానికి చెందిన ఓ వివాహిత ప్రేమించుకున్నారు. ఈ విషయం ఆమె భర్త రామ్ గోపాల్ ఠాకూర్ కు తెలియడంతో ఆమెను ఇంట్లో నిర్బంధించాడు. అయితే, ఆమె అతని కన్నుగప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ ఆమె ప్రియుడు అక్షయ్ మోహ్రాను వివాహం చేసుకుంది.
దీంతో వారిద్దరినీ గాలించి పట్టుకున్న మైదఖేడా గ్రామస్థులు చిత్రహింసలకు గురిచేశారు. ఇద్దరినీ ఇనుప చువ్వలతో విపరీతంగా కొట్టిన గ్రామస్థులు, వారి మెడల్లో చెప్పుల దండలు వేశారు. అనంతరం వారిద్దరిచేత మూత్రం తాగించారు. తీవ్రంగా గాయపడిన వారిని పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్లిపోయారు. దీంతో వారిని ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు, నలుగురు గ్రామస్థులను అదుపులోకి తీసుకున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి