ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి విధానాలను నిరసిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న సమర దీక్ష మరికాసేపట్లో మొదలు కానుంది. నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ దీక్షకు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ ఆడిటర్ విజయసాయిరెడ్డి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహా పెద్ద సంఖ్యలో నేతలు దీక్షా స్థలికి చేరుకున్నారు. జగన్ కూడా హైదరాబాదు నుంచి నేటి ఉదయమే రోడ్డు మార్గం మీదుగా మంగళగిరి బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన దీక్షా స్థలికి చేరుకోనున్నారు.