ఈ నెల 6న అమరావతిలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సుముహూర్తం నిర్ణయించింది. ఇంకా నాలుగు రోజులే సమయముండటంతో అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ కార్యక్రమంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేటి సాయంత్రం షెడ్యూల్ ప్రకటించింది. అంతేకాక ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసినట్లేనని ప్రకటించింది.
నవ్యాంధ్ర రాజధాని రూపుదిద్దుకోనున్న గుంటూరు జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్ కూసింది. దీంతో నవ్యాంధ్ర రాజధాని భూమిపూజ, అనంతరం బహిరంగ సభ నిర్వహించాలని సంకల్పించిన ప్రభుత్వం డైలమాలో పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, అప్పటికి ముందే ప్రకటించిన కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కు లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కాంతిలాల్ దండే పేర్కొన్నారు. మరి నవ్యాంధ్ర రాజధాని భూమిపూజ నిర్దేశిత సమయంలోనే జరుగుతుందా? లేక, వాయిదా పడుతుందా? అన్న విషయాన్ని ఎన్నికల సంఘం తేల్చాల్సి ఉంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి