పెళ్లిళ్లకి తాత్కాలిక విరామం లభించనుంది. రెండు ఆషాఢాలు, గోదావరి పుష్కరాలు రానుండడంతో పెళ్లి ముహూర్తాలు లేకుండా పోయాయి. మరో నాలుగు నెలలు ఆగితే కానీ శుభకార్యాలు చేసుకునే వీలు లేకపోవడంతో కేవలం పెళ్లిళ్లకే కాకుండా, శుభకార్యాలకు కూడా వేచిచూడాల్సిందే. జూన్ 11వ తేదీతో శుభముహూర్తాలు ముగిసిపోనున్నాయి. సాధారణంగా ఏటా ఒకటే ఆషాఢ మాసం ఉంటుంది. ఆ సమయంలో పెళ్లి ముహూర్తాలు ఉండవన్నది అందరికీ తెలిసిందే. అయితే, ఈసారి రెండు ఆషాఢాలు(అధిక, నిజ ఆషాఢం) వస్తున్నాయి. దీంతో రెండు నెలల పాటు ముహూర్తాలు ఉండే అవకాశం లేదు. మరోవైపు జులై 14న గురుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు.
ఇదే రోజు గోదావరి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ సమయంలో అంతా పెద్దల్ని స్మరించుకుంటూ తర్పణం సమర్పిస్తారు. ఇలా పుష్కరాలు ప్రారంభమైన నాలుగైదు మాసాల వరకు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. అదీ కాక, పుష్కరాల తరువాత వచ్చే శ్రావణ మాసంలోనూ పెళ్లి ముహూర్తాలు పెద్దగా లేవు. ఇక గోదావరి నదీ తీరప్రాంత వాసులులైతే 2016 ఆగస్ట్ వరకూ ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని వేడపండితులు పేర్కొంటున్నారు. దీంతో వివాహాలకు తాత్కాలిక విరామం లభించనుంది. తీరానికి దూరంగా ఉండే వారు మాత్రం దసరా తరువాత పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి