విలాసాల్లో తేలియాడేందుకు కూర్చున్న చెట్టునే నరుక్కున్నాడో ఉద్యోగి. ఫలితంగా కటకటాలపాలయ్యాడు. లండన్ లోని ప్రముఖ కార్ల కంపెనీ జాక్వర్ ల్యాండ్ రోవర్ లో సిమోన్ వెన్ స్లీ అనే ఉద్యోగి దుర్బుద్ధి బట్టబయలైంది. ల్యాండ్ రోవర్ కంపెనీ ఉన్నతాధికారుల సంతకాలను వందల సంఖ్యలో ఫోర్జరీ చేసి దొంగ ఆర్డర్ కాపీలను తయారు చేసేవాడు. వాటిని కోవెంట్రీ ప్రాంతంలో ఉన్న ఆ సంస్థకు చెందిన గోడౌన్ కార్మికులకు చూపించేవాడు. దీంతో వారు ఆర్డర్ కాపీలో పేర్కొన్న విడిభాగాలను అతనికి అందజేసేవారు.
వాటిని అతను స్థానికంగా ఉండే గ్యారేజ్ లలో సరసమైన ధరకు అమ్మేసి సొమ్ము చేసుకునేవాడు. ఒకసారి, రెండు సార్లు చేసి ఉంటే అలా దొరికి ఉండేవాడు కాదేమో, అది వ్యసనంగా మారడంతో గత 20 ఏళ్లుగా ఈ దందా చేస్తున్నాడు. ఇలా అతను 20 కోట్ల రూపాయల విలువ చేసే విడిభాగాలు దొంగతనం చేశాడు. అలా వచ్చిన డబ్బుతో కుటుంబంతో కలిసి విలాసవంతమైన జీవితం గడిపాడు. అతని బండారం బయటపడటంతో పోలీసులకు దొరికిపోయాడు. అతని దొంగతనాలు రుజువు కావడంతో, న్యాయస్థానం అతనికి ఐదు సంవత్సరాల శిక్ష విధించింది. చక్కగా ఉద్యోగం చేసుకోకుండా, తిన్న ఇంటి వాసాలు లెక్కించిన సీమోన్ తీరిగ్గా జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి