తక్షణం నవ్యాంధ్ర రాజధాని ప్రాంతానికి ఉద్యోగులను తరలించాలన్న ఏపీ సర్కారు ఆలోచనలకు ఎప్పటికప్పుడు బ్రేక్ పడుతోంది. సరైన సౌకర్యాలు లేకుండా తాము రాలేమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. తన శాఖలోని 9 హెచ్వోడీలను విజయవాడకు తరలించాలని మంత్రి దేవినేని ఉమ అధికారులను ఆదేశించగా, ఆయన నిర్ణయాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు. ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా, నూతన రాజధానికి వెళ్లమంటే ఎలా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇంత త్వరగా విజయవాడ వెళ్లలేమని వారు తేల్చిచెప్పారు.
మంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, నేడు జలసౌధలో నిరసనకు పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రి ఆదేశాల మేరకు, జలవనరుల శాఖ పరిపాలనా విభాగం ఇంజనీరింగ్ చీఫ్ ఆగమేఘాలపై స్పందించి, తక్షణమే విజయవాడ వెళ్లేందుకు సిద్ధం కావాలని సర్క్యులర్ జారీ చేశారు. ఫైళ్లు, ఫర్నీచర్, ఇతర సామగ్రిని విజయవాడకు తరలించేందుకు ఎంత మంది మనుషులు అవసరమో అంచనా వేయాలని కూడా ఆదేశించారు. ఉన్నపళంగా వెళ్దామంటే, అక్కడ అద్దె ఇళ్ల నుంచి పిల్లల చదువుల వరకు ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి