ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. దానిపై బాధితులు చేసిన ఫిర్యాదును వైద్యులు పట్టించుకోకపోవడంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని రాయ్ బరేలీకి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి తోపుడు బండిపై జ్యూస్ అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. అతని కుమార్తె దీపిక (6) గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. బరేలీ వైద్యుల సూచనతో తన కుమార్తెను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తీసుకువచ్చారు. ఎయిమ్స్ లో పలు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు, బాలిక ఎడమ కిడ్నీలో లోపం ఉందని, కుడి కిడ్నీ బాగానే పనిచేస్తోందని తెలిపారు.
అంతే కాకుండా కుటుంబ సభ్యులు అంగీకరిస్తే చెడిపోయిన కిడ్నీ తొలిగిస్తామని చెప్పారు. ఎడమ కిడ్నీ తొలగించే క్రమంలోనే గత మార్చి 17న పిడియాట్రిక్ విభాగంలోని సీనియర్ సర్జన్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ తరువాత బాలికకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె రెండు కిడ్నీలు కనబడలేదు. దీంతో దీపిక తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది అవాక్కయ్యారు. దీంతో శస్త్రచికిత్స నిర్వహించిన సీనియర్ సర్జన్ ను నిలదీశారు. దానికి అతను 'మీ అమ్మాయికి ఉన్నది ఒకే కిడ్నీ, దానిని నేను తీసేశా, అసలు పాపకి రెండు కిడ్నీలు లేనేలేవు' అన్నాడు. దీంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో డయాలసిస్ పై చికిత్స అందిస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి