తమిళనాడులోని పెరంబదూర్ జిల్లాలోని రాంజీనగర్ లో ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమే. అందుకేనేమో, 700 గడపలున్న ఆ గ్రామంలో 650 కుటుంబాలు చోరకళలోకి దిగిపోయాయి. చోరీల్లో వీరి తీరు వినూత్నం. రోడ్డుపై రూ.10 నోటు వేసి బాధితుల దృష్టిని మరల్చడం, వెనువెంటనే డబ్బుల సంచులతో ఉడాయించడం వీరి ప్రత్యేకత. హైదరాబాదులోని సికింద్రాబాదు రైల్వే స్టేషన్, పంజాగుట్టల్లో ఈ ముఠా ఇటీవల రెండు చోరీలకు పాల్పడింది. నాలుగేళ్ల వ్యవధిలో హైదరాబాదులో రూ.6 కోట్ల మేర నగదు, నగలను ఈ ముఠా అపహరించింది. ఇక దేశవ్యాప్తంగానూ ఈ ముఠా చేతివాటం ప్రదర్శిస్తోంది. వీరికి సంబంధించి ప్రాథమిక సమాచారం తెలుసుకున్న చెన్నై పోలీసులు రాంజీనగర్ వెళ్లి చోరుల జీవన శైలి చూసి షాకయ్యారట.
తొలుత అందరితో కలిసి గ్రామంలోనే ఉన్న చోరులు, భారీ ఎత్తున డబ్బు సమకూరడంతో సమీపంలోని వందెకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులోనే అధునాతన భవంతులను నిర్మించుకున్నారు. ఒక్కో భవంతి ఎంత లేదన్నా, రూ.50 లక్షల విలువ చేస్తుందట. మిగిలిన డబ్బుతో వీరు ఏకంగా ఫామ్ హౌస్ లనే కొనుగోలు చేశారు. పెరంబదూర్ లోని 20 ఫామ్ హౌస్ ల దాకా వీరివేనట. ఇక రాత్రి వేళల్లో ఇళ్ల వద్ద పోలీసుల భయం లేకుండా నిద్రించేందుకు వీరు కాపలా కుక్కలను వినియోగిస్తున్నారు. తోడేళ్ల మాదిరి ఉండే సదరు కుక్కలు, అపరిచితులను వెంటాడి, వేటాడతాయట. ఈ విషయాలన్నీ తెలిసిన ఓ ఇన్ స్పెక్టర్ పూజారి వేషం వేసుకుని వెళ్లగా, అనుమానం వచ్చిన దొంగలు ఆయనను పెరంబదూర్ వరకు వెంబడించారు. ఇదే అదనుగా భావించిన సదరు ఇన్ స్పెక్టర్ పోలీసులకు ఫోన్ చేసి వారిని అరెస్ట్ చేశాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి