గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని అక్షరధామ్ ఆలయంపై 2002లో ఉగ్రవాదులు దాడి చేశారు. తాము పెట్టిన బాంబు పేలుళ్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే చనిపోయిన ఉగ్రవాదుల వద్ద లభించిన ఓ సూసైడ్ నోట్ కారణంగా ఈ నేరంతో ఏమాత్రం ప్రమేయం లేని మఫ్తీ అబ్దుల్ ఖయ్యూం అరెస్టయ్యాడు. తనకు ఏ పాపం తెలియదన్న అతడి మాటలను గుజరాత్ పోలీసులు నమ్మలేదు. విచారణ పేరిట ఏకంగా 11 ఏళ్లు జైల్లో పెట్టారు. ఈ పదకొండేళ్ల పాటు అతడిని వివిధ రకాల ప్రశ్నలతో సతాయించారు. చెప్పలేని రీతిలో టార్చర్ పెట్టారు.
కీలక మలుపులు తిరిగిన ఈ కేసు సుప్రీంకోర్టు గడప కూడా తొక్కింది. అక్షరధామ్ ఆలయంపై దాడికి, మప్తీకి ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో మఫ్తీని గుజరాత్ పోలీసులు విడుదల చేయక తప్పలేదు. జైల్లో సుదీర్ఘకాలం పాటు నరకం అనుభవించి గతేడాది మే 17న బయటకు వచ్చిన మఫ్తీ, జైల్లో పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేసిన వైనాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు పూనుకున్నాడు. ‘గ్యారా సాల్ సాలఖోన్ కే పీచే’ (జైలు లోపల పదకొండేళ్లు) పేరిట పుస్తకాన్ని రాశాడు. 200 పేజీలున్న ఈ పుస్తకం గుజరాత్ పోలీసుల దాష్టీకాన్ని పాఠకుల కళ్లకు కడుతోంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి