75వ పాకిస్థాన్ దినోత్సవ వేడుకలను ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆకట్టుకునేలా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ జాతీయపతాకాన్ని అబ్దుల్ బాసిత్ ఎగురవేశారు. అనంతరం భారీ కేక్ కోశారు. ఇందులో పాక్ రాయబార కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.