తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, తెలంగాణలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాదులో 25 శాతం, రంగారెడ్డి 27 శాతం, మహబూబ్ నగర్ 42, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 21 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 25న ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, విజయవాడలో ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని అజరయ్య స్కూల్ వద్ద టీడీపీ నేతలు ఓటర్లను డబ్బుతో ప్రలోభాలకు గురిచేస్తున్నారని వామపక్షాలు ఆరోపించాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రమిస్తున్నారు.