'మా' అధ్యక్ష పదవికి నాగేంద్రబాబు వర్గం 'నటకిరీటి' రాజేంద్రప్రసాద్ ను బలపరుస్తుండడం తెలిసిందే. ఇప్పుడు రాజేంద్రప్రసాద్ కు పోటీగా సీనియర్ నటి జయసుధ రంగంలోకి దిగారు. జయసుధకు ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ మద్దతిస్తుండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అధ్యక్ష పదవికి జయసుధ రేపు (శుక్రవారం) నామినేషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. అంతకుముందు, మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, వాటిని విష్ణు కొట్టిపారేశారు.