ఏపీ అసెంబ్లీ రణరంగాన్ని తలపిస్తోంది. ఈ రోజు బడ్జెట్ పై వైకాపా అధినేత జగన్ మాట్లాడుతుండగా, తమకు ఇచ్చిన సమయం అయిపోయింది, ప్రసంగాన్ని ముగించాలంటూ స్పీకర్ కోడెల పలు మార్లు విన్నవించారు. అయిన్పటికీ, తాను మాట్లాడటానికి మరింత సమయం కావాలంటూ జగన్ పదేపదే పట్టుబట్టారు. చివరకు, ఇప్పటికే మీకిచ్చిన సమయం కన్నా చాలాసేపు మాట్లాడారు, ఇంతకంటే సమయం ఇవ్వలేమంటూ జగన్ మైకును స్పీకర్ కోడెల కట్ చేశారు. దీంతో వైకాపా సభ్యులందరూ ఒక్కసారిగా స్పీకర్ పోడియంను చుట్టుముట్టి స్పీకర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో, సభను స్పీకర్ వాయిదా వేశారు.