భారత క్రికెట్ జట్టు ఓపెనర్లలో ధావన్ దూకుడుగా ఆడుతుంటే, మరో ఎండ్ లో రోహిత్ ఆచితూచి ఆడడం మనకు తెలిసిందే. కానీ మెల్బోర్న్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది. రోహిత్ దూకుడుగా ఆడుతుంటే, ధావన్ నిదానంగా ఆడాడు. అయితే, షకీబ్ అల్ హసన్ బౌలింగ్ లో ధావన్ ను కీపర్ స్టంపింగ్ చేశాడు. 50 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేసిన ధావన్ తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. మరో వైపు రోహిత్ 40 పరుగులు పూర్తి చేసుకొని అర్ధ సెంచరీ దిశగా సాగుతున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 17 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 78 పరుగులు.