తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత నిర్వహిస్తున్న తొలి ఉగాది వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా అందజేసే ఉగాది పురస్కారాల గ్రహీతల పేర్లను ప్రకటించింది. పురస్కార విజేతల ఎంపిక కమిటీ తయారుచేసిన నివేదికకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదం తెలిపారు. తెలంగాణలో అన్ని కళలకు ప్రాధాన్యమిస్తూ పలువురు ప్రముఖులను పురస్కారాలకు ఎంపిక చేశారు. సాహిత్య రంగం - ముదిగంటి సుజాతా రెడ్డి, మలయశ్రీ, గోరెటి వెంకన్న సంగీతం విభాగం - రామలక్ష్మి, రంగాచారి, రాజగోపాలాచారి నృత్యం విభాగం - సుధీర్ రావు, రత్నశ్రీ నాటక రంగం - దాసరి అమరేందర్ ఒగ్గుకథ - ఒగ్గు ధర్మయ్య మిమిక్రీ విభాగం - సదాశివ చిత్రకళ - సూర్యప్రకాశ్, అంజనీరెడ్డి శిల్పకళ - శ్రీనివాసరెడ్డి, పాండు పేరిణి నృత్యం - పేరిణి రమేశ్ జానపద సంగీతం- వడ్డేపల్లి శ్రీనివాస్ జానపద కళా రూప ప్రదర్శన - దర్శనం మొగులయ్య హరికథ - పద్మాలయాచార్య బుర్రకథ - సరోజిని చిందు యక్షగానం - చిందు పెద్దబాబయ్య టీవీ రంగం - నాగబాల సురేశ్ సినిమా రంగం - ఎన్.శంకర్, భూపాల్ రెడ్డి జానపద చిత్రకళ - ప్రకాశ్ వైకుంఠం, చేర్యాల హస్తకళ - నల్ల విజయ్, హుజూరమ్మ కళాశ్రమం - రవీంద్రశర్మ వేదపరిశోధన విభాగం - ఎంవీ నర్సింహరెడ్డి ఇదిలాఉంటే ఉగాది పురస్కారాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు బహుమతి పెరిగింది. తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఒక్కో పురస్కారానికి ఇచ్చే మొత్తాన్ని రూ.5,116 నుంచి రూ.10,116కి పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.