లోకహితాన్ని కోరుకునే స్వాములను, పీఠాధిపతులను పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్రానికి శుభం కాదని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. మత మార్పిడులు, హిందూ పుణ్యక్షేత్రాలలో అన్యమత ప్రచారాలు జరుగుతున్న వ్యవహారాన్ని ప్రశ్నించే వారిని అడ్డుకోవాలని చూస్తున్న ప్రభుత్వం తన పధ్ధతి మార్చుకోవాలని స్వామి సూచించారు. కాగా, ఈ ఉదయం తిరుమలలో టీటీడీ పరిపాలనా భవనాన్ని ముట్టడించేందుకు పీఠాధిపతుల అధ్వర్యంలో వందలాది మంది స్వాములు, భక్తులు యాత్రికుల వసతి సముదాయం 'విష్ణు నివాసం' వద్దకు చేరుకోగా వారిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.