చాక్లెట్ దొంగతనం చేశాడన్న అనుమానంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీసులు పదేళ్ల వయసున్న ఐదో తరగతి విద్యార్ధిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అంతేకాదు, రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే ఉంచుకుని సదరు బాలుడి కాళ్లను మొద్దుకు కట్టేసి పైశాచికంగా ప్రవర్తించారు. వివరాల్లోకెళితే... వరంగల్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు వీరన్న, మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు.
శనివారం మధ్యాహ్నం తోటి విద్యార్థులతో కలిసి, ఓ దుకాణం వద్దకెళ్లాడు. షాపులో వ్యక్తులు కనిపించకపోయేసరికి వారిని పిలుచుకుంటూ లోపలికెళ్లాడు. ఇంతలోనే ఓ తుంటరి విద్యార్థి దుకాణం షట్టర్ లాగేసి పరుగందుకున్నాడు. లోపల చిక్కుకున్న వీరన్న షట్టర్ ను కొడుతూ కేకలేయడంతో పక్కనున్న వారితో పాటు దురాణం యజమాని అక్కడికి వచ్చారు. దుకాణంలో చాక్లెట్ దొంగతనానికి వచ్చావని బాలుడిని దూషించిన యజమాని అతడి జేబులోని రూ.300 లాగేసుకోగా, ఓ చోటా రాజకీయ నేత బాలుడిని పోలీసులకు అప్పగించాడు.
బాలుడిని మందలించి వదిలేయాల్సింది పోయి, పోలీసులు అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. విషయం తెలుసుకున్న వార్డెన్ వెళ్లినా బాలుడిని వదలలేదు. రాత్రంతా స్టేషన్ లోనే ఉంచుకున్న పోలీసులు బాలుడి కాళ్లను పెద్ద మొద్దుకు కట్టేశారు. తీరా మీడియా రంగప్రవేశంతో ఆదివారం ఉదయం బాలుడిని వార్డెన్ కు అప్పగించారు. విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి