వరల్డ్ కప్ లో భాగంగా నేటి తెల్లవారుజామున జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ పై శ్రీలంక ఘన విజయం సాధించింది. వెల్లింగ్టన్ లో కొద్దిసేపటి క్రితం ముగిసిన మ్యాచ్ లో సింగిల్ వికెట్ కోల్పోయిన శ్రీలంక జట్టు, ఆంగ్లేయులు పెట్టిన భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 309 పరుగులు సాధించింది. లంక బౌలర్లపై విరుచుకుపడ్డ ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జో రూట్ 108 బంతుల్లో 121 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ భారీ విజయ లక్ష్యాన్ని లంక ముందుంచింది.
అనంతరం 310 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యామ్స్ మెన్ ఆది నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ గా బరిలోకి దిగిన లాహిరు తిరిమన్నే (139) చివరి దాకా కొనసాగి సెంచరీతో చెలరేగాడు. అతడితో కలిసి లంక ఇన్నింగ్స్ ను ప్రారంభించిన తిలకరత్నే దిల్షాన్ (44) జట్టు స్కోరు సెంచరీ మార్కు తాకగానే ఔటయ్యాడు. దిల్షాన్ నిష్క్రమణతో రంగంలోకి దిగిన లంక స్టార్ బ్యాట్స్ మన్ కుమార్ సంగక్కర 86 బంతుల్లోనే 117 పరుగులు రాబట్టాడు. దీంతో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన లంకేయులు ఇంగ్లండ్ పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి