చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట రోడ్డులో సీతారాంపేట మలుపు వద్ద ఓ టవేరా వాహనాన్ని కంటెయినర్ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గంగరెడ్డి పాలెం గ్రామానికి చెందిన మామిడి వెంకటేశ్వర్లు కుటుంబం, మరికొందరు బంధువులు మొత్తం 11 మంది టవేరా వాహనంలో తిరుమల బయల్దేరారు. అయితే, సీతారాంపేట మలుపు వద్దకు వచ్చేసరికి శనివారం ఉదయం అయింది. ఆ సమయంలో యూపీ వెళుతున్న ఓ కంటెయినర్ టవేరాను బలంగా ఢీకొట్టింది. దీంతో, ఆ ప్రదేశమంతా మాంసం ముద్దలు, రోడ్డుపై రక్తపు మడుగులతో భీతావహంగా మారిపోయింది.
కొన్ని మృతదేహాలు నుజ్జునుజ్జయిన టవేరాలో ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సాయంతో పోలీసులు మృతదేహాలను బయటికి తీశారు. ప్రమాదం జరిగిన సమయం ఉదయం కావడంతో ఇరు వాహనాల డ్రైవర్లూ నిద్రమత్తు కారణంగానే వాహనాలపై అదుపుకోల్పోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి