బీహార్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార జేడీయూలో ఆధిపత్య పోరు బీహార్ లో రాజకీయ సంక్షోభానికి తెరలేపింది. జేడీయూకు చెందిన 97 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభాధ్యక్షుడిగా మాజీ సీఎం నితీష్ కుమార్ ను ఎన్నుకున్నారు. దీంతో ప్రస్తుత సీఎం జతిన్ కుమార్ మాంఝీ పదవీత్యాగం చేయాల్సి ఉండగా, ఆయన అందుకు తిరస్కరించారు.
దీనికి తోడు ఆయన అసెంబ్లీని రద్దుచేయాలని గవర్నర్ కు సిఫారసు చేయనున్నట్టు తెలుస్తోంది. తన మంత్రి వర్గ సహచరులను మార్చాలని ఆయన గవర్నర్ కు సిఫారసు చేశారు. దీంతో ఆయన వ్యూహాత్మకంగా ఈ అడుగు వేశారని పరిశీలకులు భావిస్తున్నారు. మంత్రి వర్గాన్ని రద్దు చేస్తే, ఆయన బలపరీక్షలో నిలబడాల్సి రావచ్చు. దీంతో ఆయన రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
అదే జరిగితే ఆయన బీజేపీ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. బీహార్ లో బీజేపీకి 87 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాసపరీక్షలో మాంఝీ ప్రభుత్వం గట్టెక్కాలంటే కనీసం 117 మంది ఎమ్మెల్యేలు కావాలి. బీజేపీ మద్దతిస్తే సొంత పార్టీ నేతల్లో కొంత మందిని ఆకట్టుకున్నా సరిపోతుంది. ఈ నేపధ్యంలో మాంఝీ ప్రధాని నరేంద్ర మోదీని నేటి సాయంత్రం కలవనున్నారు.
ఈ భేటీలో మద్దతుపై చర్చ జరిగే అవకాశం ఉంది. మాంఝీకి బీజేపీ మద్దతిస్తే బీహార్ లో బలం పుంజుకోవాలని భావిస్తున్న ఆ పార్టీకి భవిష్యత్ లో మంచిరోజులు వచ్చినట్టే. మొత్తానికి బీహార్ రాజకీయ సంక్షోభం జేడీయూకి ప్రాణసంకటంలా పరిణమిస్తే, బీజేపీకి మాత్రం లబ్ధి చేకూర్చేలా కనిపిస్తున్నాయి.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్