గుంటూరు కేంద్రంగా 'నవ్యాంధ్ర' పేరిట ఒక టీవీ ఛానల్ పెట్టి రిపోర్టర్లుగా నియమిస్తానంటూ, ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసిన న్యూస్ చానల్ ఎండీ సునీల్ ను నెల్లూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరు నెలల క్రితం నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూరు గ్రామంలో కొత్తగా నిర్మించిన రామాలయంలో రూ.2 లక్షలు, మంగళసూత్రం, సజ్జాపురంలోని మరో ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం అపహరించుకుపోయినట్లు రూరల్ పోలీసు స్టేషన్ లో ఇప్పటికే కేసు నమోదైంది.
అంతకన్నా ముందు, భక్తవత్సలనగర్ ప్రాంతంలోని కృష్ణమందిరంలో 6 మంగళసూత్రాలతో పాటు కొంత నగదు, బంగారం తీసుకెళ్లినట్లు ఒక కేసు నమోదై ఉంది. ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పని చేస్తూ నగదు అపహరించుకుపోగా, దాని నిర్వాహకులు ఇప్పటికీ సునీల్ కోసం గాలిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు సునీల్ ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టి ఒంగోలులో ఉన్నాడని పసిగట్టి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలతో పాటు గుంటూరు, విజయవాడ, కర్నూలు ప్రాంతాల్లో అదనపు రిపోర్టర్లను నియమించుకుని లక్షల రూపాయలు వసూలు చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి