ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనలను తెలంగాణ సర్కారు మరింత కఠినం చేసింది. అన్ని రకాలుగా అర్హత సాధించిన విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరేలా సర్కారు పటిష్ట చర్యలు చేపట్టనుంది. విద్యార్థులకు 75 శాతం హాజరు, పైతరగతికి వెళ్లేందుకు అర్హత ఉంటేనే ‘ఫీజు’ ఇవ్వాలని భావిస్తోంది. బోగస్ విద్యార్థులు, కాలేజీలకు చెక్ పెట్టేందుకు నిబంధనలను కఠినతరం చేసినట్టు అధికారులు తెలిపారు. కాలేజీల వారీగా విద్యార్థుల ఆధార్, ఈ-పాస్ తో అనుసంధానం చేయాలని, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలు ఇచ్చే నివేదిక ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరపాలని భావిస్తున్నట్టు వివరించారు.
ధనవంతులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ‘ఫీజు’ పొందకుండా విద్యార్థులు, తల్లిదండ్రుల ఆధార్ ను కూడా తప్పనిసరి చేయాలన్న ఆలోచనతోనూ ఉన్నట్లు సమాచారం. విద్యార్థుల ఆధార్ కార్డులు, ఆదాయ పరిమితి, కులం, ఇతర ధ్రువీకరణ పత్రాలను ఎమ్మార్వోలు కచ్చిత సమాచారంతో ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, తప్పుడు సర్టిఫికెట్లను ఇచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి