"నన్ను నేను రక్షించుకునేందుకు నాకు ఎలాంటి అద్భుత శక్తులూ అవసరం లేదు. ఎందుకంటే మా నాన్న ఉన్నాడు. ఆయన ఉండగా నాకు భయమెందుకు?" అంటూ కోట్ చేసిన గ్రీటింగ్ కార్డును కమలికా దాస్ అనే 17 ఏళ్ల కోల్ కతా యువతి ఫాదర్స్ డే రోజున తన తండ్రికి అందజేసింది. దానిని అందుకున్న ఆ తండ్రి ఎంతో ఉప్పొంగిపోయాడు. అంతటి అద్భుతమైన రీతిలో సందేశాన్నిచ్చిన కుమార్తెను కాపాడుకోలేకపోయాను, నా కుమార్తె చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ యువతి తండ్రి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖరాశాడు.
వివరాల్లోకి వెళితే... కమలికా దాస్ అనే యువతి కోల్ కతాలోని కేంద్రీయ విద్యాలయలో చదువుతోంది. నాలుగేళ్ల కిందట అదే స్కూల్ లో చదువుతున్న సహవిద్యార్థి కమలికను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో, బాలిక సదరు విద్యార్థిపై స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో యాజమాన్యం బాలుడిని స్కూలు నుంచి పంపించేసింది. లైంగిక వేధింపులు ఆగినప్పటికీ టీచర్లు, ప్రిన్సిపల్ తదితరుల వేధింపులు మొదలయ్యాయి.
బాలుడిపై నిరాధారమైన ఫిర్యాదు చేసి, స్కూల్ కు చెడ్డపేరు తెస్తున్నావంటూ మండిపడడం ప్రారంభించారు. హోం వర్క్ సరిగా చేయడం లేదని స్కూలు నుంచి పంపేస్తామని బెదిరించారు. దీంతో, తన స్కూలు డైరీ పేజీలో ప్రిన్సిపాల్ కి వీడ్కోలు సందేశం రాసిన కమలిక, జనవరి 19న తాము నివసిస్తున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తన కుమార్తె మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కమలిక తండ్రి పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలంటూ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్