కీచకులు మహిళలను నేల మీదే కాదు, ఆకాశంలో కూడా వదలడం లేదు. ఇండిగో విమానంలో వయసు మీరిన ఈవ్ టీజర్ ఆగడాలకు వీడియోతో బుద్ధి చెప్పిందో యువతి. జార్ఖండ్ కు చెందిన ఓ యువతి ఇండిగో విమానంలో భువనేశ్వర్ ప్రయాణిస్తుండగా, ఆమె వెనుక సీటులో వయసు మీరిన ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. సీట్ల మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు.
అతని ప్రయత్నాన్ని పసిగట్టిన యువతి అతని ఆకతాయి చర్యలను అడ్డుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా అతను ఆగడం లేదు. దీంతో విసిగిపోయిన ఆమె ధైర్యం కూడదీసుకుని అతని ఫొటోతో పాటు అక్కడ జరుగుతున్న సంఘటనను కొద్దిసేపు వీడియో తీసింది. తరువాత ఒక్కసారిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు ఆ యువతికి అండగా నిలిచారు.
దీంతో, జరిగిన సంఘటనపై సహ ప్రయాణికులతో కలిసి ఆమె ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, విమానంలో ఈవ్ టీజర్ భువనేశ్వర్ లోని పలు కంపెనీలకు ఛైర్మన్ అని తెలుస్తోంది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొంత సేపటి తరువాత వదిలేయడం గమనార్హం.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి