ఇల్లు అంటే విశాలంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. విశాలమైన బెడ్రూం, అంతకంటే విశాలమైన లివింగ్ రూం, అన్ని సౌకర్యాలున్న పెద్ద వంటగది... ఎవరైనా ఇలాంటిల్లు కోరుకుంటారు. కానీ, ఇజ్రాయెల్ కు చెందిన రచయిత, సినీ దర్శకుడు ఎట్గర్ కెరెట్ ముచ్చటపడి మరీ జీరోసైజ్ ఇంటిని కట్టించుకున్నాడు. కేవలం 48 అంగుళాల పరిధిలో ఈ ఇల్లు రూపుదిద్దుకోవడం విశేషం.
ఈ రోజుల్లో ఇల్లు కొనాలంటే లక్షలు చెల్లించాలి. దేశ రాజధానుల్లాంటి మహానగరాల్లో అయితే గజం స్థలానికే లక్షలు చెల్లించాలి. అలాంటి చోట్ల పరిష్కార మార్గంగా ఈ ఇల్లు కనిపిస్తోంది. పోలండ్ రాజధానిలోని వార్సాలో ఇజ్రాయిెల్ దర్శకుడు ఆరునెలలు ఉండాల్సి ఉంది. దీంతో ఓ ఇల్లు నిర్మించుకోవాలని భావించాడు. దీంతో, రెండు పెద్ద భవనాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని భావించి, వాటి యజమానుల అనుమతితో, పోలండ్ ఆర్ట్ ఫౌండ్ సహకారంతో జాకబ్ సెజెస్నీ అనే ఆర్కెటిక్ట్ ఈ ఇంటికి రూపకల్పన చేశారు.
దీంట్లో సింగిల్ బెడ్ రూం, కిచెన్, డైనింగ్ రూం, బాత్ రూం వంటివి ఉండడం విశేషం, అయితే రెండు అంతస్తులు కలిగిన ఈ ఇంట్లో రెండవ అంతస్తుకెళ్లాంటే మాత్రం నిచ్చెన ఉపయోగించాల్సిందే. ప్రపంచంలో అత్యంత సన్నని ఇల్లు ఇదే. అల్ట్రా మోడ్రన్ ఇల్లుగా ఇది గుర్తింపు సంపాదించుకుంది.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్