దారి కాచి భారీ వాహనాలను ఆపి, వాటిలోని విలువైన వస్తువులను చోరీ చేస్తున్న ఘటనలు రాష్ట్రాల సరిహద్దుల్లో తరచూ జరగడం చూస్తున్నదే. విలువైన లోడుతో బయలుదేరిన వాహనాలను వెంబడించి, రాష్ట్రాల సరిహద్దుల్లో సదరు వాహనాలపై దాడులకు దిగే ముఠాలు... వాహనాలతో పరారై, అందులోని సామాగ్రిని సంచుల్లో వేసుకుని నింపాదిగా వెళ్లపోతున్న ఘటనలు బోలెడన్ని నమోదయ్యాయి. చోరీ జరిగిన తర్వాత ఏ నెలకో, రెండు నెలలకో సదరు వాహనాల ఆచూకీ తెలుస్తోంది. ఈ తరహా చోరీలు హైదరాబాదు నగరంలో ఇప్పటిదాకా జరగలేదనే చెప్పాలి.
నేటి ఉదయం ఓ ముఠా ఇదే రీతిలో చోరీకి పాల్పడింది. డ్రైవర్ ను చితకబాదిన దొంగలు లారీతో ఉడాయించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఔటర్ రింగురోడ్డుపై ఈ ఘటన జరిగింది. పెద్ద అంబర్ పేట నుంచి తుక్కుగూడ వైపు వస్తున్న లారీ (AP29 TB 115)ని దుండగులు అటకాయించారు. డ్రైవర్‌ను చితకబాదారు. ఆ తర్వాత లారీతో పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి