సాధారణంగా కారు సీటు కవర్ కింద కుషన్ ఉంటుంది. లగేజీ స్థానంలో డ్రెస్సులతో కూడిన బ్యాగులు ఉంటాయి. అయితే చెన్నైలో ప్రమాదానికి గురైన ఓ కారులో కుషన్, డ్రెస్సుల స్థానంలో నోట్ల కట్టలున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు... 300 కట్టలకు పైగా వెలుగు చూసిన ఈ నోట్ల కట్టలను కనుగొన్న పోలీసులు షాక్ తిన్నారు. అసలే ఉగ్రవాద సంచారం నేపథ్యంలో తీవ్ర స్థాయిలో సోదాలు జరుగుతుంటే, ఏమాత్రం భీతి లేకుండా ఓ వ్యక్తి రూ.3 కోట్లకు పైగా నగదును ఎంచక్కా కారులో తరలించేందుకు పూనుకున్నాడు.
అయితే కోయంబత్తూరు సమీపంలో సేలం-కోచి జాతీయ రహదారిపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొనడంతో సదరు కారులోని నగదు బయటపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు గాయపడగా, కారు డోర్లు కూడా విరిగిపోయాయి. దీంతో కారులోని నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
సమాచారం తెలుసుకున్న అక్కడి జనం తండోపతండాలుగా వచ్చి దొరికినకాడికి పట్టుకెళ్లారు. కాస్త ఆలస్యంగా అక్కడికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, రూ.500 డినామినేషన్ లోని 490 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి ప్రజలు కూడా పట్టుకెళ్లిన మొత్తంతో కలుపుకుంటే కారులో తరలిస్తున్న నగదు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, అసలు అంతపెద్ద ఎత్తున నగదు ఎవరికోసం తరలిస్తున్నారని ఆరా తీస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి