ప్రపంచ దేశాలు మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారుతున్నాయా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రేటు పాతాళానికి పడిపోవడం, గణనీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం తదితరాలు మరో ఆర్థిక మాంద్యం ఏర్పడనుందన్న సంకేతాలను పంపుతున్నాయి. వీటికితోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర ఐదేళ్ళ తరువాత 50 డాలర్ల దిగువకు వచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తీవ్ర భయాందోళనలకు గురై తమ తమ వాటాలను విక్రయించేందుకు ముందుకు వస్తున్నారు. ఫలితంగా ప్రపంచ మార్కెట్లన్నీ భారీ నష్టాల్లో సాగుతున్నాయి. గత సంవత్సరం అక్టోబర్ 9 తరువాత అమెరికా మార్కెట్ అత్యధిక పతనాన్ని నమోదు చేయగా, జపాన్, కొరియా, చైనా, భారత మార్కెట్లన్నీ దాదాపు అదే దారిలో నడుస్తున్నాయి.
యూరోజోన్ లో అతి తక్కువ వృద్ది రేటు నమోదవుతుండటం, జోన్ నుంచి గ్రీస్ తప్పుకోనుందని వస్తున్న వార్తలు మొత్తం యూరప్ దేశాలపై ప్రభావం చూపాయి. డాలర్ తో పోలిస్తే యూరో మారకపు విలువ ఐదేళ్ళ కనిష్ఠానికి పడిపోయింది. మరోవైపు అమెరికాలో సైతం పెట్టుబడిదారులు తమ డబ్బును మార్కెట్లలో ఉంచేందుకు వెనుకంజ వేస్తున్నారు. చమురు రంగంలో సేవలందిస్తున్న కంపెనీల షేర్ల విలువ గణనీయంగా పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తొందర్లోనే ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి