బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మంచి వైద్యం కోసం ఆయన్ను రేపు హైదరాబాదుకు తీసుకురానున్నట్టు బీజేపీ నేతలు చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం కాలిబాటలో తిరుమలకు బయల్దేరిన ఆయన మధ్యలో స్పృహ కోల్పోయి పడిపోయారు. పక్కనే ఉన్న కార్యకర్తలు వెంటనే ఆయన్ను దగ్గరలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పుడే మురళీధర్ రావుకు గుండెపోటు వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. అనంతరం స్విమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.