ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీ హార్బర్లో టీమిండియా సేదదీరింది. ఆస్ట్రేలియాలో భారత్ హైకమిషన్ క్రికెటర్ల జల విహారానికి ఏర్పాట్లు చేసింది. ఓ క్రూయిజ్ లైనర్ లో టీమిండియా క్రికెటర్లు సిడ్నీ సముద్ర జలాల్లో గంటన్నర సేపు విహరించారు. వీరికి భారత హైకమిషనర్ బీరేన్ నందా స్వాగతం పలికారు. ఆటగాళ్లకు విందు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా హైకమిషనర్ మాట్లాడుతూ, సిరీస్ లో భారత జట్టు పోరాట పటిమను కనబర్చడాన్ని ప్రస్తుతించారు. వరల్డ్ కప్ వరకు ఇదే పంథా కొనసాగించాలని ఆకాంక్షించారు.
భారత్ హైకమిషన్ ఆతిథ్యంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. సాగరజలాల్లో అద్భుతరీతిలో ఆతిథ్యమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఆయా దేశాల్లో హైకమిషన్ లు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు ఇది భిన్నంగా ఉందని పేర్కొన్నాడు. ఇక, ఉపన్యాసాలు, కానుకలు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత ఆటగాళ్లకు ఆ క్రూయిజ్ లైనర్ పైనే విందు ఏర్పాటు చేశారు. అనంతరం, ఆ విలాసవంతమైన నౌక హార్బర్ చేరుకోగా, ఆటగాళ్లు హోటల్ కు పయనమయ్యారు.
More Telugu News
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!