మదుపరులను నిండా ముంచేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యం, జరిగిన మోసాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాపైకి గూండాలను ఉసిగొల్పింది. అధిక వడ్డీల పేరిట కోట్లాది రూపాయల డిపాజిట్లను సేకరించి లక్షలాది మంది సామాన్యులను ముంచేసిన అగ్రిగోల్డ్ పై ఫిర్యాదుల వెల్లువ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ యజమానులు రామారావు, కుమార్ ఇళ్లల్లో ఏలూరు సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రధాన కార్యాలయంలో మొదలైన సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సోదాలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై అగ్రిగోల్డ్ గూండాలు దాడికి దిగారు. రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అయితే ఈ తతంగాన్ని కళ్లారా చూసిన పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. అంతటితో ఆగని పోలీసులు అగ్రిగోల్డ్ గూండాలను వదిలేసి జర్నలిస్టులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టు సంఘాలు డీజీపీకి ఫిర్యాదు చేశాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన బెజవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి