మనీ సర్క్యులేషన్ స్కీం పేరిట అగ్రిగోల్డ్ సంస్థ కూడా మోసాలకు పాల్పడింది. ఈ మేరకు ఆ సంస్థపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అగ్రిగోల్డ్, తక్కువ కాలంలోనే అధిక వడ్డీలతో సొమ్మును రెట్టింపు చేసి ఇస్తామని చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది. అయితే మెచ్యూరిటీ తీరిన బాండ్లకు సంబంధించిన సొమ్మును చెల్లించడంలో ఆ సంస్థ విఫలమైంది.
ఈ క్రమంలో సంస్థ డిపాజిటర్లు విజయవాడ సహా నెల్లూరు, ఏలూరు తదితర ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల గడప తొక్కారు. దీంతో సంస్థ యజమానులు రామారావు, కుమార్ ల ఇళ్లలో ఏలూరు సీసీఎస్ పోలీసులు నిన్న రాత్రంతా తనిఖీలు చేసి పలు కీలక డాక్యుమెంట్లతో రూ.28 లక్షల విలువ చేసే నగలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏలూరు సీసీఎస్ పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు బాధితుల నుంచి ఫిర్యాదుల వెల్లువ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆ సంస్థపై కేసులు నమోదయ్యాయి. డిపాజిట్ల సేకరణలో అగ్రిగోల్డ్ నిర్వాహకులు ఆర్బీఐ నిబంధనలను అతిక్రమించారని కేసులు దాఖలయ్యాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి