ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) నుంచి ముప్పు ఇంకా తుడిచిపెట్టుకుపోలేదని శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి గోటాభాయ రాజపక్స అన్నారు. ఆ తిరుగుబాటు సంస్థ ఇప్పటికీ విదేశాల్లో చురుకుగానే ఉందని హెచ్చరించారు. తన అన్న మహింద రాజపక్స తరపున ఎన్నికల ప్రచార ర్యాలీలో గోటాభాయ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రసంగిస్తూ, "ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ చనిపోయాడు. కానీ ఆ ప్రమాదం (ఎల్టీటీఈ) అంతరించిపోయిందని ఎవరైనా ఆలోచిస్తారా? అది నిజం కాదు. టైగర్స్ చాలా మంది పారిపోయినప్పటికీ విదేశాల్లో యాక్టివ్ గానే ఉన్నారు" అని పేర్కొన్నారు.
అంతేగాక, తీవ్రవాదం రూపంలో ఎల్టీటీఈ నుంచి ప్రమాదం పొంచి ఉందని, 80ల్లోని తీవ్రవాద చీకటి శకం తిరిగి దేశంలో చెలరేగే అవకాశం ఉందన్నారు. కాబట్టి దేశ భధ్రత కొనసాగించేందుకు తాము తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అధికారం కావాలని కోరుకుంటూ తమిళ ఆధిపత్యం ఉన్న ఉత్తర ప్రాంతంలో మిలటరీని తొలగించాలని కోరడం తప్పని పేర్కొన్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి